WhatsApp Image 2024 10 25 at 19.27.14
విశ్వరూప దర్శనంలో శ్రీ కాలభైరవ స్వామి
Trinethram News : చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరి పట్టణం లో వెలసియున్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయములో వైభవంగా అష్టమి పూజలు నిర్వహించారు ప్రతినెల విశేష అష్టమి నందు స్వామివారికి ప్రత్యేక అభిషేక అర్చన కార్యక్రమలు జరుగుతున్నాయి స్వామివారికి నేడు పాలు. పెరుగు, పంచామృతం, కొబ్బరి నీరు, చందనం, పన్నీరు,
విభూది,సుగంధ ద్రవ్యములతో ప్రత్యేక అభిషేక అర్చనలు జరిగాయి, అనంతరం స్వామివారికి పట్టు వస్త్రముతో అలంకరించి, వడమాల పుష్పమాలతో అలంకరించి భక్తులను ఆకట్టు కున్నాయి
విచ్చేసిన భక్తులందరికీ వివిధ రకములైన ప్రసాదములు ఆలయ నిర్వహకులు పంపిణీ చేశారు
రాబోవు కార్తీక్ నెలలో జరుగు విశేష మహా ఆష్టమి నవంబర్ నెల 23వ తేదీ జరుగు ”మహా కాల అష్టమి యాగము” నందు భక్తులు పాల్గొని శ్రీ భైరవ స్వామి ఆశీస్సులు పొందాలని ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ స్వామీ భక్తులకు వివరించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
