WhatsApp Image 2024 10 25 at 18.51.02
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, అల్లూరిజిల్లా ఇంచార్జ్ : (జి . మాడుగుల మండలం) అల్లూరిజిల్లా, జి . మాడుగుల మండలం, నుర్మతి పంచాయతీ, కరకదాటు గ్రామ యువత జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారితో పాడేరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, డా.. వంపూరు గంగులయ్య మాట్లాడుతూ మా పార్టీలో చెరికలకు గిరిజన యువత, ఎక్కువ ఆసక్తి చూపుతోంది. కారణం స్థానికంగా గిరిజన ప్రాంత పరిస్థితులపై గతంలో పాలించిన, వివిధ పార్టీల నాయకులకంటే కూడా నేటి యువత అవగాహన కలిగివున్నారు. అలాగే పంచాయితీ రాజ్ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ యొక్క పనితీరు విధానం చూస్తున్నారు. గిరిజన యువత ప్రస్తుతం నిజాయితీ గల రాజకీయాలపై ఆలోచన చేస్తున్నది. మీరు చేరుతున్నందుకు మీకు పార్టీ తరుపున అభినందనలు తెలియజేస్తున్నమంటూ వారికి సాదరంగా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి అహహ్వానించడమైనది. ఈ చెరికలలో పాల్గొన్న అధికార ప్రతినిధి బొనుకుల దివ్యలత, గండేరి పార్వతి,పాంగీ శివాజీ, తరడ రమేష్ నాయుడు,తల్లే త్రిమూర్తి, సాలేబు అశోక్ తదితర జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
