ధర్మసాగర్ ఎల్కుర్తి మండలం లో మెడికల్ క్యాంపు నిర్వహించిన పల్లె దావఖన వైద్యాధికారి

TRINETHRAM NEWS

ధర్మసాగర్ ఎల్కుర్తి మండలం లో మెడికల్ క్యాంపు నిర్వహించిన పల్లె దావఖన వైద్యాధికారి

హనుమకొండ జిల్లా
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

హనుమకొండ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.కే.లలిత దేవి ఆదేశనుసారం శుక్రవారం మెడికల్ క్యాంపు ధర్మసాగర్ ఎల్కుర్తి విలేజ్లో వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్. పుట్ట మహేందర్ రావు వచ్చిన రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది . అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలన్నారు ముఖ్యంగా దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని అన్నారు మరియు పౌష్టిక ఆహారం తీసు కోవాలని గుడ్లు, పాలు, మొదలైనవి ఎక్కువ మోతాలు తీసుకోవాలన్నారు. కార్యక్ర మంలో ఏఎన్ఎం,ఆశా వర్కర్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top