WhatsApp Image 2024 10 07 at 4.19.52 PM
ఆర్చరీ క్రీడాకారిణి కాంపౌండ్ బో అందజేసిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, అక్టోబర్-07: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జిల్లాలో క్రీడలకు సంబంధించి ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన తోడ్పాటు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్ లో ప్రతిభా వంతురాలైన ఆర్చరీ క్రీడాకారిణి జి.అర్చనకు కాంపౌండ్ బో పంపిణీ చేశారు.
ముత్తారం మండలం కాసర్ల గడ్డ గ్రామానికి చెందిన కుమారి జి.అర్చన గత సంవత్సరం జరిగిన జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి క్రీడల కోటాలో బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించడం జరిగింది. ఈ విద్యార్థిని ఆర్చరీ తనకు కాంపౌండ్ బో కావాలని జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది.
విద్యార్థిని దరఖాస్తు పరిశీలించిన జిల్లా కలెక్టర్ లక్షా 25 వేల 328 రూపాయలను మంజూరు చేస్తూ విద్యార్థినికి అవసరమైన కాంపౌండ్ బో కొనుగోలు చేసి నేడు పంపిణీ చేశారు. విద్యార్థిని భవిష్యత్తులో ఆర్చరీ లో గొప్ప క్రీడాకారిణీగా ఎదగాలని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు తోడ్పాటు జిల్లా యంత్రాంగం తరపున అందిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్, తదితరులు పాల్గోన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
