జూన్ 27, 2026

WhatsApp Image 2024 10 07 at 3.48.15 PM

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్ గాంధీనగర్ కు చెందిన గద్దల సాయి సుదీక్ష హైదరాబాద్ లో ఎంబిబిఎస్ చదువుతున్న విద్యార్థినికి ప్రతినెల 2000 రూపాయలు ప్యాకెట్ మనీ ఇస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా సోమవారం రోజున సాయి సుదీక్ష తండ్రి గద్దల అనిల్ కుమార్ కు 2000 రూపాయల చెక్ ను అందజేసినట్లు మడిపెల్లి మల్లేష్ తెలిపారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులందరి సహకారంతో సాయి సుదీక్ష కు గత 33 నెలలుగా 2000 రూపాయలు ప్యాకెట్ మని ఇవ్వడం జరుగుతుందని మరియు సభ్యులందరి సహకారంతో రామగుండం నియోజకవర్గంలో పేదవారు చనిపోతే వారి అంతిమ యాత్ర నిర్వహించడానికి డబ్బులు లేక కుటుంబ సబ్యులు ఇబ్బంది పడుతు నాకు ఫొన్ చేస్తే మరణించిన వారి ఇంటి దగ్గర కు పాడే సామానులు అందజేయడం జరుగుతుందని మల్లేష్ తెలిపారు ఇప్పటి వరకు వందలాది నిరుపేదలకు ఆఖరి మజిలీ పేరుతో పాడే సామానులు పంపియ్యడం జరిగిందని ఈ సందర్భంగా సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులందరి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నారు ప్రత్యేకంగా ఎంబీబీస్ చదువుతున్న విద్యార్థిని సాయి సుదీక్ష కు ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి నెల సహాయం అందిస్తున్న దాతలకు మరియు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సబ్యులకు సాయి సుదీక్ష తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page