WhatsApp Image 2024 10 05 at 17.52.44
Additional Collector of Drinking Water
సుల్తానాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సుల్తానాబాద్ ప్రభుత్వ కళాశాలలో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి త్రాగునీరు అందించిన పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్
ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులు, అధ్యాపకుల తాగునీటి సమస్య గురించి అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందిస్తూ వెంటనే వాటర్ ప్లాంట్ ను మరమ్మతులు చేయించి శనివారం ప్రారంభించి, త్రాగునీరు అందించడం జరిగింది.
వ్యయ ప్రయాసాలకు ఓర్చి విద్యార్థులకు జీవాధారమైన చక్కటి నీటిని సమకూర్చి విద్యార్థుల పట్ల అవ్యాజమైన ప్రేమను కనబరిచిన ఆదర్శ అధికారికి కళాశాల ప్రిన్సిపాల్ ఎం. రామచంద్రారెడ్డి ధన్యవాదములు తెలియజేయడం జరిగింది.
ఎస్ జి ఎఫ్ టైక్వాండో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి పెద్ది పార్ధును అడిషనల్ కలెక్టర్ అభినందించారు.
అనంతరం బతుకమ్మ పండుగ సంబరాలను ప్రారంభించి ఆటపాటలు, కోలాటాలులతో ఆడి ఆడబిడ్డలకు సంతోషాన్ని, ఉత్సాహాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
