జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 05 at 16.58.33

TRINETHRAM NEWS

Kota Kumar grew up believing in hard work and not luck

రియల్ ఎస్టేట్ వ్యాపారం నుండి గోల్డ్ డైమెండ్స్ వ్యాపారం వరకు అంచెలంచెలుగా ఎదిగిన కుమార్

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ వ్యాపారంలో అడుగుపెట్టిన ఖని యువ వ్యాపారవేత్త కోట కుమార్

దుబాయ్ లో అక్షర గోల్డ్ డైమండ్స్ కార్యాలయం ట్రేడింగ్ సెంటర్ ను మరియు కేకే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ఛైర్మెన్ హార్కర వేణు గోపాల్

కష్టపడి పని చేస్తే చాలని, అదే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుందని చిన్నప్పటి నుండి సామెతలు, సలహాలు చెప్పేవారు కానీ, అది నిజంగా అది జరుగుతుందో లేదో కానీ కోట కుమార్ విషయంలో అది నిజం అని నిరూపించిన గోదావరిఖని ప్రాంత యువకుడు కోట కుమార్ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ఛైర్మెన్ హార్కార వేణు గోపాల్ అన్నారు.
శుక్రవారం రోజున దుబాయ్ లోని  లిసింగ్ సెంటర్, శేరిన ప్లాజా, ఇత్ర స్ట్రీట్, డైర క్రోణిక్ లో

అక్షర గోల్డ్ డైమండ్స్ ట్రేడింగ్ సెంటర్ ను మరియు కేకే కాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కార్యాలయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ఛైర్మెన్ హర్కర వేణుగోపాల్ ముఖ్యతిథులుగా హాజరై ప్రారంభించారు.
అనంతరం హార్కార వేణు గోపాల్ మాట్లాడుతూ సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంత వాసి కార్మికుని బిడ్డ పెద మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎలాంటి అస్తులు, అంతస్తులు, రాజకీయ వారసత్వం లేకున్నా, కష్టపడి చదువుకుని కష్టాన్ని నమ్ముకొని తన తెలివి తేటలతో ముందుగా విద్య రంగంలో అడుగు పెట్టి మరోవైపు చిన్నగా రియల్ ఎస్టేట్ ప్రారంభించి అష్ట కష్టాలు పడుతూ
అవమానాలను ఆకలిని ఏ మాత్రం లెక్క చేయకుండా కేవలం తన కష్టాన్ని నమ్ముకొని తను అనుకున్న ఉన్నత శిఖరాలను ఎదిగిన గొప్ప వ్యక్తిత్వం కల్గిన వ్యక్తి కోట కుమార్ అని పేర్కొన్నారు.
సామాన్య కుటుంబంలో పుట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం నుండి అంచెలంచెలుగా ఎదిగి నేడు దేశ విదేశాలలో అక్షర గోల్డ్ డైమండ్స్ వ్యాపారంతో ముందుకు సాగుతూ అదే విధంగా కేకే కాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కంపనీ లను వివిధ దేశాలలో ప్రారంభించడం మామూలు విషయం కాదని,
ప్రపంచంలోని వివిధ దేశాలలో అక్షర గోల్డ్ డైమండ్స్ వ్యాపారాన్ని విస్తరిస్తున్న గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత నవ యువకుడు *కోట కుమార్ అని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాని,
కోట కుమార్ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత యువకులు స్ఫూర్తిగా తీసుకొని ముందుకుసాగాలి హర్కర వేణు గోపాల్ యువత కు పిలుపునిచ్చారు.
కోట కుమార్ అక్షర గోల్డ్ అండ్ డైమండ్స్ మరియు కేకే కాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ యావత్ ప్రపంచం దేశాలలో విస్తరించే విధంగా వారి వ్యాపారం కొనసాగాలని మంచికి, సక్సెస్ కు మారు పెరు కోట కుమార్ అని కొనియాడారు. కుమార్ నిరంతరం మా ఆశీస్సులు ఉంటాయని హార్కార వేణుగోపాల్ పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kota Kumar grew up believing in hard work and not luck

You cannot copy content of this page