WhatsApp Image 2023 12 28 at 3.53.59 PM
YV Subba Reddy : త్వరలోనే విశాఖ నుంచి పాల. స్పష్టం చేసిన వైవీ సుబ్బారెడ్డి
విశాఖపట్టణం – టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. మూడు జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఈ సందర్బంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు వైవీకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.
త్వరలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారని చెప్పారు. అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు ఎమ్మెల్సీ ఇచ్చారని, కానీ తను జనసేన పార్టీలో చేరడం విడ్డూరంగా ఉందన్నారు వైవీ సుబ్బారెడ్డి.
పార్టీ పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రయారిటీ ఇచ్చిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. పార్టీలో ఎవరు ఉన్నా లేదా లేక పోయినా , పార్టీని వీడినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు . వచ్చే ఎన్నికల్లో తిరిగి రెండోసారి పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు వైవీఎస్.
175 సీట్లకు గాను అత్యధిక సీట్లు తమ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
