జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 28 at 6.32.05 PM

TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్‌ పశు సంవర్ధక సహాయకుల రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల..

డిసెంబర్‌ 31న పరీక్ష

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి సంబంధించిన హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. డిసెంబర్‌ 31న రాత పరీక్ష జరుగనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కాగా ఈ నోటిఫికేషన్‌ కింద పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసులో రెగ్యులర్ ప్రాతిపదికన 1,896 పశుసంవర్ధక సహాయక (ఏహెచ్‌ఏ) పోస్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గోపాలమిత్ర/ గోపాలమిత్ర సూపర్‌వైజర్‌గా పనిచేసిన అభ్యర్థులకు వెయిటేజీ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నెలకు రూ.22,460 నుంచి రూ.72,810 వరకు వేతనం చెల్లిస్తారు

You cannot copy content of this page