జూన్ 27, 2026

WhatsApp Image 2024 09 16 at 19.22.22

TRINETHRAM NEWS

Former MP Mekapati donates Rs 25 lakhs to Telangana flood victims

తెలంగాణ వరద బాధితులకు మాజీ ఎంపీ మేకపాటి రూ.25 లక్షలు విరాళం : సీయం రేవంత్ రెడ్డికి చెక్కు అందచేత

ఇటివల వరదలతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులకు గురవడంతో వారి సహాయార్థం నెల్లూరు మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి రూ.25లక్షలు విరాళం ప్రకటించిన విషయం విధితమే. సోమవారం హైదరాబాద్ లో తెలంగాణ సీయం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి రూ.25లక్షల చెక్కును అందచేశారు.

తీవ్ర వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడిన ప్రజలందరిని ఆదుకునేలా ప్రభుత్వం కృషి చేయాలని, ప్రజాప్రతినిధులు, ప్రజలు, స్వచ్చంధసంస్థలు తమ వంతు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ సీయం రేవంత్ రెడ్డి మాజీ ఎంపీ మేకపాటిని శాలువాలతో ఘనంగా సత్కరించి ఆయన అందచేసిన సహాయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

అందరి సహకారంతో వరద బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటున్నామని, బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు సీయం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ మేకపాటి వెంట ఆయన తనయుడు మేకపాటి ఫృద్విరెడ్డి ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page