జూన్ 27, 2026

WhatsApp Image 2024 09 14 at 17.19.20

TRINETHRAM NEWS

KTR visited former minister Lakshmareddy

Trinethram News : సతీమణిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు.
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలోని లక్ష్మారెడ్డి ఇంటికి శనివారం కేటీఆర్‌ వెళ్లారు. అక్కడ లక్ష్మారెడ్డి సతీమణి చిత్రపటానికి నివాళులు అర్పించారు.

అనంతరం లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులతో కేటీఆర్‌ మాట్లాడి ధైర్యం చెప్పారు. లక్ష్మారెడ్డి పిల్లలతో మాట్లాడుతూ తల్లి లేని లోటు తీర్చలేనిదన్నారు. ఈ కష్ట సమయంలో మనో స్థైర్యాన్ని కోల్పోవద్దని లక్ష్మారెడ్డికి సూచించారు. కేటీఆర్‌తోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి గారిని పరామర్శించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

KTR visited former minister Lakshmareddy

2 thoughts on “KTR : మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్‌

Comments are closed.

You cannot copy content of this page