WhatsApp Image 2024 09 19 at 15.32.19
Arresting farmers fighting for loan waiver is outrageous: KTR
Trinethram News : హైదరాబాద్ : రుణమాఫీ కోసం పోరాడుతున్న రైతులను అరెస్టు చేయడం దారుణమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చిన వారి అరెస్టును ఖండిస్తున్నామన్నారు.
రైతులు, సంఘాల నేతలను పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణమని చెప్పారు. అక్రమంగా నిర్బంధించిన అన్నదాతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చి మోసం చేసినందునే ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల సంఘటిత శక్తి ముందు ప్రభుత్వం తలవంచక తప్పదని కేటీఆర్ తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
