జూన్ 27, 2026

WhatsApp Image 2024 09 08 at 16.15.54

TRINETHRAM NEWS

Opening of Sadar Qazi Office of Vikarabad, Nawab Pate and Pudur Mandal

Trinethram News : వికారాబాద్: సదర్ ఖాజీ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని వికారాబాద్ జిల్లా సదర్ ఖాజీ సయ్యద్ ముఖ్తాదీర్ అలీ ఖాద్రీ అన్నారు. ముస్లిం సమాజానికి చెందిన వివాహాలను జరిపించి వారికి అధికారికంగా సర్టిఫికేట్లు ఇవ్వడానికి పట్టణంలోని ఆలంపల్లి రోడ్డులోని జమ్ జమ్ స్వీట్ హౌస్ వెనుక భాగంలో సదర్ ఖాజీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వికారాబాద్ మండలం, నవాబ్ పేట్ మండలం మరియు పూడూరు మండలానికి చెందిన నాయబ్ ఖాజీలుగా జాకీర్ ముహియుద్దీన్ మరియు ఖమ్రుద్దీన్ ని వికారాబాద్ జిల్లా సదర్ ఖాజీ సయ్యద్ ముఖ్తాదీర్ అలీ ఖాద్రీ నియమించడం జరిగింది. ముస్లింలకు సంభందించిన పెళ్లిళ్లు, ఖులా, తలాఖ్, ప్రభుత్వం నుండీ ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికేట్ వంటి అంశాల గురించి సంప్రదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ అధ్యక్షులు, ముస్లిం మత పెద్దలు మస్జిద్ ఇమామ్ లు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page