WhatsApp Image 2024 09 08 at 19.10.02
Distribution of essential items to the poor family
పల్లికొండ రాజేష్ ఆధ్వర్యంలో భరోసా స్వచ్ఛంద సంస్థ నసీమ సహకారంతో నిరుపేద కుటుంబానికి ఆపన్న హస్తం
భరోసా సేవలు అభినందనీయం మరేందరికో మార్గదర్శకం ఫిషరీష్ చైర్మన్ పల్లికొండ రాజేష్
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఇందిరమ్మ కాలనీ, రామగుండం రోజున ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ ఆధ్వర్యంలో భరోసా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు నసీమ సహకారం తో నిరుపేద దినసరి కూలీ కుటుంబం ఇల్లు గడవలేని దీన పరిస్థితులలో మానవత్వంతో స్పందించి వేముల సంపత్ సౌజన్యంతో బియ్యం బస్తా తో పాటు నిత్యవసర వస్తువులు పుర ప్రముఖుల మధ్య అందజేయడం జరిగినది.
ఈ సందర్భంగా పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ
రోజువారి దినచర్యలో భాగంగా ఇటీవల కూలి కార్మికునుగా సెంట్రింగ్ పనులలో విధులు నిర్వహిస్తుండగా దురదృష్టవశత్తు పై నుండి కింద పడి నడుము విరిగిపోయి కాలు చేతులు పనిచేయక ఆచేతన స్థితిలో ఉన్న సామల సత్తయ్య పరామర్శించి వారికి నిత్యవసర వస్తువులను అందజేయడం జరిగినదని, సామల సత్తయ్య భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని కుటుంబo భారం అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం తీవ్రంగా మనసును కలచివేస్తున్నదని ఇంకా ఎవరైనా వీరి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని సామల సతీష్ కుటుంబానికి చేయూతను అందజేయాలని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగినది. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు వేముల సంపత్, కునారపు ప్రేమ్ కుమార్, ధారంగుల కుమార్, గున్నాల శ్రీనివాస్,గున్నాల కృష్ణమూర్తి, బింగి రవి, ప్రదీప్, ఉమర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
