TRINETHRAM NEWS

Will decide on retirement: Saina Nehwal

Trinethram News : Sep 02, 2024,

కీళ్లనొప్పులతో బాధపడుతున్నా.. త్వరలోనే రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటా: సైనా నెహ్వాల్
తాను (ఆర్థరైటిస్‌) కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నట్లు భారత అగ్రశ్రేణి షట్లర్‌, ఒలింపిక్‌ పతక విజేత సైనా నెహ్వాల్‌ తెలిపింది. నొప్పి తీవ్రత వల్ల ప్రాక్టీస్‌ చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఈ ఏడాది చివరినాటికి రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించింది. ‘నాకు కీళ్లనొప్పులు ఉన్నాయి. దీని వల్ల ఎక్కువ సమయం ప్రాక్టీస్‌ చేయలేకపోతున్నాను. సుదీర్ఘ కాలం దేశానికి ఆడాను. దానికి నేను చాలా గర్వపడుతున్నాను.’ అని సైనా పేర్కొంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App