IMG 20240831 WA0029
Chigullapally Manjula Ramesh, Municipal Chairperson of Vikarabad supervised the plantation program
Trinethram News : ఎన్టీఆర్ చౌరస్తా ప్రధాన కూడలి నుంచి ఎన్నెపల్లి చౌరస్తా వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని పర్యవేక్షించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ..
గతంలో ఎన్టీఆర్ చౌరస్తా నుండి ఎన్నెపల్లి చౌరస్తా వరకు రోడ్డు డివైడర్లో పెట్టిన కొనో కార్పస్ మొక్కలను ప్రజారోగ్యం దృష్ట్యా తొలగించామని… వాటిస్థానంలో ఫాక్స్ టైల్, డ్రాకేనా మొక్కలను నాటడం జరుగుతుందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చైర్ పర్సన్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జాకీర్ అహ్మద్, శానిటేషన్ ఇంచార్జ్ ఎస్ఐ యేసు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
