జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 30 at 16.54.19

TRINETHRAM NEWS

Inspection of helipad, paving, meeting areas

రామగుండం పోలీస్ కమీషనరేట్

డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్

హెలిప్యాడ్, శంకుస్థాపన, మీటింగ్ ప్రాంతాల పరిశీలన

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రేపు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, గోదావరిఖని మరియు మంచిర్యాల జోన్ పరిధి జైపూర్ STPP, చెన్నూర్ లలో కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి భద్రత, బందోబస్తు ఏర్పాట్లను పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్. మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., గారితో కలసి పరిశీలించారు. కమీషనరేట్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ గ్రౌండ్, రామగుండం, గోదావరిఖని జైపూర్ STPP ప్లాంట్, చెన్నూర్ లలో పలు శంకుస్థాపన చేసే స్థలాలు, సభ వేదికను సందర్శించి భద్రత పరమైన ఏర్పాట్లను పరిశీలించారు.

సభ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, సభకు వచ్చే మార్గాలపై అధికారులతో పోలీస్ కమిషనర్ చర్చించి డిప్యూటీ సీఎం పర్యటించే ప్రాంతాలలో పూర్తిస్థాయిలో నిఘా, పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లకు అవసరమైన చర్యలపై పోలీస్ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా భద్రత చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వాహనాలకు, ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, పర్యటన సజావుగా సాగేలా కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపడుతునట్లు తెలిపారు.

కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., అడిషనల్ డీసీపీ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఏసీపీ రమేష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు,ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏఆర్ ఏసీపీ లు ప్రతాప్, సురేంద్ర, సిఐలు, ఎస్ఐ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Inspection of helipad, paving, meeting areas

You cannot copy content of this page