WhatsApp Image 2024 08 24 at 20.03.26 modified
Missing Musharraf’s body found
Trinethram News : Andhra Pradesh : కృష్ణాజిల్లా కోడూరు మండలం హంసలదీవి బీచ్ వద్ద ఈనెల 18 వ తేదీన సముద్రంలో గల్లంతయిన గుడివాడకు చెందిన యువకుడు అబ్దుల్ ముషారఫ్(21) మృతదేహం ఎట్టకేలకు లభ్యమయింది.
గత ఆరు రోజులుగా మృతదేహం కోసం ప్రత్యేక బోట్లలో గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం రాత్రి బందరు మండలం కే పి టి పాలెం వద్ద ముషారఫ్ మృతదేహం కనిపించినట్లు కోడూరు ఎస్సై పి శిరీష తెలిపారు.
మృతదేహాన్ని పంచనామా అనంతరం పోస్టుమార్టం చేసి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు ఎస్సై తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
