WhatsApp Image 2024 08 18 at 16.37.31
A spirited gathering of alumni
24 ఏళ్లకు కలిసిన విద్యార్థుల అనుభూతికి హద్దులు లేవు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని విద్యానగర్లోని శ్రీరామ విద్యాలయంలో 1999 – 2000 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ముందుగా శ్రీరామ విద్యాలయం వ్యవస్థాపకులు, ప్రధానోపాధ్యాయులు పిట్టల రాజేందర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. టీచర్లు పద్మావతి, భాగ్య లక్ష్మి, ఉమాదేవి, జయశ్రీ, జ్యోతి, బి సరోజలను ఆత్మీయంగా సన్మానించారు. అలాగే సిబ్బంది సాయిలు, యాదగిరి లను సన్మానించారు. అనంతరం ఒకచోట చేరిన పూర్వ విద్యార్థిని, విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు జీవితంలో నేర్చుకున్న విలువలను కాపాడుతూ ముందుకు సాగాలని చిన్ననాడు చేసిన అల్లరి, మరోసారి కేరింతలతో మారుమ్రోగించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుత జీవన శైలిని వివరాలు అనుభూతులను పంచుకున్నారు వివిధ చోట్ల ఉన్న ఈ రోజు ఒక చోట కలవడం ఆనందంగా ఉందని పలువురు పేర్కొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
