జూన్ 27, 2026

WhatsApp Image 2024 08 15 at 16.19.43

TRINETHRAM NEWS

NCP Party North Telangana Central Office celebrated Independence Day grandly

గోదావరిఖని పట్టణంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ కార్యక్రమానికి ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మొదటగా భరతమాత చిత్ర పటానికి పూలమాల వేసి, భారత జాతీయ జెండా ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యోద్యమంలో అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారని, బ్రిటీష్ వారిని భారతదేశం నుండి తరిమి కొట్టి భారతీయులకు స్వాతంత్ర్య ఫలాలు అందించిన మహనీయులను
ఈరోజు ప్రజలందరూ స్మరించుకోవాలని, భారత స్వాతంత్ర్య సమరయోధులందరీ విగ్రహాలను రామగుండం కార్పోరేషన్ ఏరియాలో ప్రతిష్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్” చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర, నాయకులు చెన్నూరి నాగరాజు, బలరాం రెడ్డి, సయ్యద్ ముజాహిద్, గుళ్లపల్లి రాజు, రాంరెడ్డి, భాస్కర్, సదానందం గౌడ్, జీవన్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page