CM Chandrababu : ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు గృహప్రవేశం-ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం

TRINETHRAM NEWS

Chief Minister Chandrababu’s homecoming tour in Delhi was a success

న్యూ ఢిల్ల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధ‌వారం ఢిల్లీలో సీఎం అధికారిక నివాసం వన్ జనపథ్ లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి గృహ‌ప్ర‌వేశం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) పాల్గొన్నారు. అనంత‌రం వన్ జనపథ్ లో ఎపి భ‌వ‌న్ రెసిడెన్స్ క‌మిష‌న‌ర్ లావు అగ‌ర్వాల్ త‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా సీఎం చంద్ర‌బాబు నాయుడు కి కేంద్రంలో మంత్రిత్వ శాఖల ప‌రంగా పెండింగ్ వున్న ప‌నుల వివ‌రాలు తెలియ‌జేసిన‌ట్లు ఎంపి కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డించారు.

ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా ముగిసింద‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎంపి సీఎం ర‌మేష్ బాబు, ఎంపి లావు కృష్ణ‌దేవ‌రాయులు, కేంద్ర‌విమానాయ‌న శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు, చిత్తూరు ఎంపి డి.ప్ర‌సాద రావుల‌తో పాటు ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాధికారులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister Chandrababu's homecoming tour in Delhi was a success

You cannot copy content of this page

Scroll to Top