జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 13 at 10.29.28 AM

TRINETHRAM NEWS

Collapsed slab in girls university hostel

Trinethram News : హన్మకొండ జిల్లా : జులై 13
బాలికల హాస్టల్లో స్లాబ్ కుప్పకూలిన ఘటన హనుమకొండ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

కాకతీయ యూనివర్సిటీ పోతన బాలికల హాస్టల్ అర్ధరాత్రి స్లాబ్ కుప్పకూ లడంతో విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. అదృష్టవశాత్తూ ఆ సమ యంలో గదిలో ఎవరు లేకపోవడంతో తమ ప్రాణాలకు ప్రమాదం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లేకపోతే ఎంతమంది ప్రాణాలకు హాని జరిగుండేది అంటూ యజమాన్యాన్ని విద్యార్థులు నిలదీస్తు న్నారు. కొద్దిరోజుల క్రితమే ఫ్యాన్‌ కిందపడి విద్యార్థికి గాయాలయ్యాయి.

ఇలాంటి సంఘటనలు జరుగుతున్న ఎవరు పట్టించుకోవడం లేదంటూ యాజమాన్యాన్ని గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాణాలకు ఏమైనా జరిగితే మీరు బాధ్యులా? మిమ్మల్ని నమ్మి పంపిన మా తల్లిదం డ్రుల పరిస్థితి ఏంటి? ఇప్పటికి ఎన్నో ఘటనలు జరిగినా పెడచెవిన పెడుతున్నారు.

మాకు ప్రాణ రక్షణ కావాలంటూ కాకతీయ యూనివర్సీటీ పోతన బాలికల హాస్టల్ అమ్మాయిలు ఆందోళన చేపడుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Collapsed slab in girls university hostel

You cannot copy content of this page