To stop the auction of coal wells and allocate coal wells to Singareni
గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈ సందర్భంగా ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్ వేల్పుల కుమారస్వామి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యం రావు, ఐద్వా జిల్లా కార్యదర్శి మహేశ్వరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గణేష్, ఎస్.ఎఫ్.ఐ.జిల్లా అధ్యక్షులు సందీప్,
డి.వై.ఎఫ్.ఐ. జిల్లా అధ్యక్షులు సాగర్, పట్నం కార్పొరేషన్ కార్యదర్శి తిరుపతి లు మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బొగ్గు గనులు వేలం వేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి
కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా
ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటని అన్నారు.
ఈ వేలం పాటలో సింగరేణి యాజమాన్యం పల్గొనవద్దని ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు విజ్ఞపి చేశారు. ఈ విషయంపై సింగరేణికి బొగ్గు గనుల తవ్వకాల కేటాయించాలని
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు అసెంబ్లీ తీర్మానం కూడా చేయాలని అన్నారు.
సింగరేణి ప్రైవేటు పరం అయితే కార్మికులకు ఎలాంటి చట్టాలు గానీ, హక్కులు గానీ అమలు కావని అన్నారు. దీంతో పాటు సింగరేణి పరిసర ప్రాంతాలు, ప్రజల జీవన విధానం కూడా నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. నరేంద్ర మోడీ కేవలం తన జేబు సంస్థలుగా ఉన్న ఆదాని,అంబానీ లాంటి వారికి దేశ సంపదను దోచి పెట్టడమే మోడీ ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నం అని అన్నారు. ఇప్పటికే గడిచిన పదేళ్ల కాలంలో సుమారు 200 బొగ్గు గనులు ప్రైవేటు వారికి అప్పచెప్పారని అన్నారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని,సింగరేణికి బొగ్గు గనుల తవ్వకాలు అప్పచెప్పాలని లేని పక్షంలో బొగ్గు గనుల
వేలంకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలను, రాజకీయ పార్టీలను ఏకం చేసి భవిష్యత్తులో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈకార్యక్రమంలో రామాచారి,జ్యోతి,శంకర్, నర్సయ్య,లక్ష్మారెడ్డి,
నాగమణి, కృష్ణ,సతీష్,క్రాంతి,శంకర్,సురేష్,మల్లేష్,కనుకయ్య,దీప,హమీద,మహేశ్వరి,
భాగ్య,అనూష,మౌనిక,
ఫైముద,బానయ్య,లక్ష్మి,యమున లతో పాటు 50 మంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App