WhatsApp Image 2024 06 27 at 4.03.58 PM
Palnadu district Vinukonda road accident three Died
వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం సమిపంలో రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి.
Trinethram News : పల్నాడు జిల్లా
వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం – పార్వతీపురం మధ్య లో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. గుంటూరు కి చెందిన సోలాసి బాల గంగాధర శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి బళ్లారి నుంచి గుంటూరు వస్తుండగా మార్గమధ్యలో అందుగుల కొత్తపాలెం సమిపంలో తాము ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గంగాధర శర్మ, అతని భార్య, కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మిగిలిన ఐదుగురు కి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించామని సిఐ సాంబశివరావు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
