WhatsApp Image 2024 06 21 at 21.14.38
International Yoga Day celebrations in Jawahar Nagar
త్రినేత్రం న్యూస్ జవహర్ నగర్ కాప్రా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండల్
జవహర్ నగర్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బాలాజీ నగర్ లోని బీజెపి కార్యాలయంలో ప్రముఖ యోగా గురువైన శంకరాచార్య ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో పలు ఆసనాలతో పాటు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం నేర్పిస్తూ వాటి ప్రయోజనాలను యోగాచార్యులు అందరికీ వివరించడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజలందికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా ద్వారా శారీరిక మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, వయోబేదం లేకుండా ప్రతి ఒక్కరూ యోగ నేర్చుకుని రోజూ సాధన చేయాలని కోరారు.
ఇకపై ప్రతి ఆదివారం ఉచితంగా యోగ శిక్షణ అందిస్తా
ఈ సందర్భంగా యోగ గురువు శంకరాచారి మీడియాతో మాట్లాడుతూ నేటినుండి ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి ఎనిమిది గంటల వరకు ప్రజలకు ఉచితంగా యోగశిక్షణను అందిస్తానని అంతర్జాతీయ యోగా దినోత్సవం సాక్షిగా ప్రకటించారు. తాను నేర్చుకున్న యోగ విద్యను (హఠ యోగ) వీలైనంత ఎక్కువ మందికి నేర్పి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించడమే తన లక్ష్యమని అన్నారు. ఈ యజ్ఞం నిరాటంకంగా కొనసాగడానికి కావలసిన వసతులను కల్పించాలని మేయర్ ను ప్రభుత్వాన్ని కోరారు. శరవేగంగా మారుతున్న ఈ ఆధునిక కాలంలో గాలి, నీరు, ఆహారం కలుషితమవడం, పని ఒత్తిడి జీవనశైలిలో మార్పులు, సోషల్ మీడియాకు బానిసవడం వలన ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రతినిత్యం యోగ సాధన చేస్తూ యోగ జీవన విధానాన్ని అవలంబించడం ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గొడుగు వేణు, జవహర్ నగర్ బిజెపి అద్యక్షులు కమల్ చారి, బీజేపి జిల్లా బిజెపి కార్యదర్శి కుర్ర పుణ్యరాజు, యువ మోర్చ రాష్ట్ర నాయకులు సంతోష్ గుప్త, స్థానిక బిజెపి మాజీ అధ్యక్షులు మహేందర్ యాదవ్, అశోక్ గౌడ్, స్థానిక దళిత మోర్చా అధ్యక్షులు వేపుల సన్నీ, మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీ రెడ్డి, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు సంగ గణేష్, బిజెపి కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఐటి-సోషల్ మీడియా కన్వీనర్ ముచ్చర్ల యాదగిరి, బిజెవైఎం నాయకులు సందీప్ ముదిరాజ్, తులసి రామ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంతగాని కోటేష్ గౌడ్, భాష పల్లి రమేష్ చారి, బింగి సతీష్ గౌడ్, బూడిద వెంకటేష్, తెలంగాణ ఉద్యమకారులు మారోజు రమేష్ చారి, పద్మారావు, నమస్తే తెలంగాణ రిపోర్టర్ నర్సిహ్మ, నిలా ప్రసాద్, నీలా కిషోర్, నగేష్, మహేష్, తోపాటు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
