CITU is the owner of drinking water
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల క్రితం వాడ వాడల తిరుగుతూ కార్మిక వాడల సమస్యలను తెరమీదకి తీసుకొచ్చిన క్రమంలో కార్మికవాడలకు యాజమాన్యం సప్లై చేసే మంచినీరు మూర్ఖునీరు వస్తుందని దాని బారిన అనేక రోగాలు వస్తున్నాయని లేక పోరాటాలు ఆందోళనలు చేస్తే యాజమాన్యం గోదావరిఖని అడ్డాగా గ్రావిటీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు రెండు సంవత్సరాల క్రితం ప్రకటించారు వాటిని ప్రారంభిస్తున్నట్లుగా అలంకారంగా నిధులను విడుదల చేస్తే శంకుస్థాపన చేసిన యాజమాన్యం నేటికీ సంవత్సరం గడిచిన ఇప్పటికి కూడా పనులు పూర్తికాలేదు.
కార్మిక వాడలకు మంచినీరు సరిగా రావడం లేదని ఎన్నిసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకు వచ్చిన ప్రతిసారి తనిఖీలు చేస్తున్నట్లుగా యాజమాన్యం ఫోటోలు చూపుతో త్వరలో చేస్తామని ముసలి కన్నీరు కారుస్తూ కార్మికుల ఆరోగ్యాలతో ఆడుకుంటుంది. త్వరలో త్వరలో అంటూ లేనిపోని ఆశలు చూపుతూ ఊసరుమనిపించడం తప్ప పని చేసింది లేదు వాటర్ ప్లాంట్ల నిర్మాణం చూస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నదన్న చందంగా మారింది ఇప్పటికే ఆదాయపన్ను భారంతో నష్టపోతుంటే త్రాగునీటికై సైతం ప్రతినెల వేళల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుందని మినరల్ ప్లాంట్లు సైతం చెడిపోతుంటే రిపేర్లు చేయించుకుంటూ ఆర్థికంగా నష్టపోతున్న కార్మికులను పట్టించుకోవాల్సిన గెలిచి ఉన్న సంఘాలు యాజమాన్యం చంకలో చేరి గుర్తింపు పత్రం కై పోరాటం చేయకుండా పైరవీలకే పబ్బం గడుపుతున్నారు తప్ప కార్మిక సమస్యలను పట్టించుకోవడం లేదు. సంక్షేమపై యాజమాన్యం దృష్టి పెట్టి కార్మిక వాడలలో తిరుగుతూ సమస్యలు తెలుసుకునేదని రాను రాను యాజమాన్యాలు ఉత్పత్తి పైన దృష్టి పెడుతూ కార్మికుల సంక్షేమాన్ని మరిచిపోతుందని యాజమాన్యం ఇకనైనా అన్ని కార్మిక సంఘాలతో ప్రతి నెల ఒక ఏరియా తిరుగుతూ కార్మిక వాడల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని లేనిపక్షంలో గతంలో మాదిరి కార్మిక కుటుంబాలతో జిఎం ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిక చేస్తున్నాము.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App