జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 23 at 5.40.14 PM

TRINETHRAM NEWS

ఏప్రిల్ నెలలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు?

అమరావతి:డిసెంబర్23
రెండు రోజులుగా కేంద్ర ఎన్నికల బృందం పర్య టిస్తూండటంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజు కుంటోంది.

శుక్రవారం నాడు 18 జిల్లాలలో పరిస్థితిని సమీక్షించిన ఎన్నికల బృందం, శనివారం మరో 8 జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వ హిస్తోంది.

సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ఎన్నికల బృందం ఆరా తీసింది. ఓటర్ల జాబితాలో అవ కతవకలపై కూడా ఎన్నికల అధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది.

ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ ఎన్నికల బృందం సూచ నప్రాయంగా వెల్లడించింది. సమయం ఎక్కువగా లేనందున యుద్ధప్రాతి పదికన సన్నద్ధం కావా లంటూ కలెక్టర్లు,ఎస్పీలకు సూచించింది.

ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావాన్ని అరికట్టాలని ఎన్నికల బృందానికి నాయకత్వం వహించిన డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు.

సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ను కట్టుదిట్టం చేయాలని, చెక్ పోస్టులపై ఒక కన్ను వేసి ఉంచాలని సూచిం చారు.

You cannot copy content of this page