జూన్ 27, 2026

WhatsApp Image 2024 05 31 at 12.35.06

TRINETHRAM NEWS

Comments to provoke polling agents..Criminal case against Sajjal

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జలు రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

రూల్స్ పాటించే వారు కౌంటింగ్‌కు అక్కరలేదని, వాదించే వారు మాత్రమే వెళ్ళాలని రామకృష్ణా రెడ్డి చెప్పారు. సజ్జలపై ఐపీసీ లోని u/s 153,505 (2) IPC, 125 RPA 1951 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు న్యాయవాది లక్ష్మీనారాయణకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

epaper Sakshitha
Download app

Comments to provoke polling agents..Criminal case against Sajjal

You cannot copy content of this page