జూన్ 27, 2026

WhatsApp Image 2024 05 20 at 14.00.17

TRINETHRAM NEWS

5th phase polling across the country

దేశ వ్యాప్తంగా 5వ దశ లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు.

ఈ నేపథ్యంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుత బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ అమేథీ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆమె అమేథీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

ఈరోజు తన గ్రామం గౌరీగంజ్‌లో వికసిత్ భారత్‌ సంకల్పంతో తన ఓటు వేయడం జరిగిందన్నారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి.. దేశ భవిష్యత్తుకు బాధ్యతగా ఓటు వేయమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

5th phase polling across the country

You cannot copy content of this page