జూన్ 27, 2026

Untitled4

TRINETHRAM NEWS

తెలుగుదేశం పార్టీ నాయకుల దాడి

గాయపడిన వైసిపి కార్యకర్తలు..

పరామర్శించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం రెడ్డికొత్తూరు, ఈపూరు మండలం కొండ్రముట్ల, ముపాళ్ళ, బొల్లాపల్లి పేరురపాడు గ్రామాలలో లో ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల వాతావరణం లో ఘర్షణ నెలకొలిపారు ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి మద్దతు గా ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో గాయాలపాలైన వారు ప్రభుత్వ వైద్యశాల లో చికిత్స పొందుతుండగా విషయం తెలిసుకున్న శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు బాధితులను పరామర్శించారు. వారి పరిస్థితి ని డాక్టర్ ని అడిగి తెలుకొని, మెరుగైన వైద్యం కోసం గుంటూరు పంపేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బాధిత కుటుంబాలను కలిసి వారికి ధైర్యం చెప్పారు. ఎవరికి ఎం కాదని మీకు నేను ఉన్నానని హామీ ఇచ్చారు. అలాగే దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి సూచించారు.

You cannot copy content of this page