ఎన్నికల ఫిర్యాదుల కొరకు ప్రత్యేక ఫోన్ నంబర్ – 9440796184

TRINETHRAM NEWS

Trinethram News : పల్నాడు జిల్లా ప్రజలు స్వేచ్చగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే మా ప్రధాన ధ్యేయం – ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్

సార్వత్రిక ఎన్నికలు – 2024 దృష్ట్యా పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా ఏదైనా అనుకొని సంఘటన జరిగినప్పుడు, దానిని వెంటనే పరిష్కరించే దిశగా పల్నాడు జిల్లా పోలీస్ విభాగం అడుగులు వేస్తుందని ఎస్పీ గారు తెలిపారు.

దానిలో భాగంగానే ప్రజల నుండి ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు అందుకోవడానికి వీలుగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ఒక ఫోన్ నంబర్ – 9440796184 కేటాయించడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు.

ఎవరైనా/ ఏదైనా రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్ కమిషన్ వారు జారీ చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించినా వెంటనే పోలీస్ వారి దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు.

You cannot copy content of this page

Scroll to Top