వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేయరాదు: ఈసీ

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి, ఎన్నికల వేళ ఈరోజు ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టింది.

వారితో నగదు పంపిణీ చేయించవద్దని సీఈవో ముకేశ్‌ కుమార్‌మీనా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు వాలం టీర్లకు ఇచ్చిన ట్యాబ్‌, మొబైల్‌ డిపాజిట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించారు..

You cannot copy content of this page

Scroll to Top