జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 21 at 3.55.50 PM

TRINETHRAM NEWS

నిరుద్యోగులను, పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి

డాక్టర్ పి. చైతన్యకుమార్ రెడ్డి.

నిరుద్యోగులను, పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రముఖ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ చైతన్య కుమార్ రెడ్డి అన్నారు. రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్, సి.పి అండ్ పి.హెచ్.పి.డబ్ల్యు అసోసియేషన్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎందరో ఉద్యోగం దొరకక నిరుద్యోగులు నిరాశ, నిస్పృహకు లోనై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరికే అవకాశాలేదని, స్వయం ఉపాధితో ముందుకు పోవాలని ఆయన కోరారు. స్వయం ఉపాధి చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానంఉన్నా, శ్రమచేసే ఆలోచన ఉన్నా, పెట్టుబడి లేక చాలామంది నిరాశ, నిశ్రుహకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి వారిని ఆదరించేందుకు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ఆయన కోరారు. షేక్ ఖాన్ అనే ఒక నిరుద్యోగికి రమేష్ బాబు అనే వ్యాపారవేత్త కుట్టుమిషన్ ను ఈ సందర్భంగా అందజేశారు. పీ.హెచ్.పీ జిల్లా గౌరవాధ్యక్షులు అనుముల జయప్రకాష్ మాట్లాడుతూ మానవతా దృష్టితో నిరుద్యోగికి సహాయం చేసిన రమేష్ బాబును, రూడ్స్, పి.హెచ్.పి సంస్థలను అభినందించారు. ప్రతి నిరుద్యోగి కూడా తమకున్న అవకాశాల్ని ఉపయోగించుకొని స్వయం ఉపాధి రంగంలో ముందుకు పోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూడ్స్ సంస్థ అధ్యక్షులు షేక్ రసూల్, పీ.హెచ్.పీ అసోసియేషన్ అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి గోరంట్ల శేషయ్య, దాత రమేష్ బాబు, బాలాజీ ఆప్టికల్ ఓనర్ పి. ముత్తు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page