కాంగ్రెస్‌లో చేరనున్న మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి?

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:మార్చి 23
లోక్ సభ ఎన్నికల వేళ అధి కార కాంగ్రెస్ పార్టీలోకి వల సలు పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చు కునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

మేయర్ విజయలక్ష్మితో పాటు పది మంది కార్పొ రేటర్లు సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. నిన్న విజయలక్ష్మి నివాసం లో కాంగ్రెస్ ఇంఛార్జీ దీపాదా స్ మున్షీ, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్ రెడ్డిలు సమావేశం అయ్యారు.

కాంగ్రెస్‌లోకి రావాలని దీప దాస్ మున్షీ గద్వాల విజయ లక్ష్మిని ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించిన తరువాత నిర్ణయం చెబు తానని, రెండు సార్లు తన ను గెలిపించిన కార్యకర్తల కు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోనని విజ యలక్ష్మి చెప్పినట్లు సమా చారం.

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కే. కేశవరావు కుమార్తె. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ బీఆర్ఎస్ కార్పొరేటర్‌గా ఆమె విజ యం సాధించారు. 2021 లోనూ రెండోసారి గెలిచి జీహెచ్‌ఎంసీ మేయర్ అయ్యారు.

You cannot copy content of this page

Scroll to Top