జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 17 at 13.13.55

TRINETHRAM NEWS

నిజాం ఎన్ని అభివృద్ధి పనులు చేసినా.. నిరంకుశత్వ వైఖరి ప్రజల్లో తిరుగుబాటుకు కారణమైంది..

తెలంగాణ సమాజం బానిసత్వాన్ని సహించదని చరిత్ర చెబుతోంది.

రాచరిక పోకడలతో వారసత్వాన్ని చలాయించాలని కేసీఆర్ ప్రయత్నించారు..

ఖాసీం రిజ్వీలా తెలంగాణలో తన ఆధిపత్యం, అధికారంపై తిరుగుబాటు చేసినవారిని కేసీఆర్ అణిచివేసే ప్రయత్నం చేశారు.

సచివాలయం, కాళేశ్వరం లాంటివి చూపి ప్రజల స్వేచ్ఛను హరించారు.

75 ఏళ్ల తరువాత తెలంగాణ ప్రజలు పోరాడి మళ్లీ స్వేచ్ఛను తెచ్చుకున్నారు.

కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారు..

నిజాం విధానాల నకలును కేసీఆర్ అమలు చేశారు..

అందుకే ప్రజలు కేసీఆర్ విధానాలను వ్యతిరేకించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు.

వంద రోజుల ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించాం…

గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకెళుతున్నాం..

ఇన్నాళ్లు కవులు కళాకారులను కేసీఆర్ తన గడీలో బంధించారు.

దొరగారి భుజకీర్తులను సాగించాలని తెలంగాణ సాంస్కృతిక చరిత్రపై దాడి చేశారు.

అందుకే మా ప్రభుత్వం ఉద్యమ సూర్తిని రగిలించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం..

ప్రగతి భవన్ ముళ్ల కంచెను బద్దలు కొట్టి ప్రజలకు స్వేచ్ఛను కల్పించాం..

రాష్ట్ర పరిపాలనను నిర్దేశించే సచివాలయంలో అందరికీ ప్రవేశం కల్పించాం

మేం పాలకులం కాదు.. సేవకులం అని తెలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం

కొద్దిమంది అధికారులతో సాగించిన పాలనకు స్వస్తి చెప్పాం.

పరిపాలన వికేంద్రీకరణ చేసి పారదర్శక పాలన అందించే ప్రయత్నం చేశాం.

సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకెళుతున్నాం..

ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదలను ఆదుకుంటున్నాం..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ పథకాలను అమలు చేస్తున్నాం

ఇప్పటి వరకు 8లక్షల కుటుంబాలు రూ.500 గ్యాస్ సిలిండర్ అందుకున్నాయి.

200 యూనిట్ల ఉచిత కరెంటును అమలు చేసాం..

హరీష్ ఇంటిపేరులో తన్నీరు ఉన్నంత మాత్రాన ఆయన పన్నీరు కాదు..

జీరో బిల్ ను మేం అమలు చేస్తుంటే తెలివితేటలు ఉపయోగించి అడ్డుకోవాలని చూస్తున్నారు..

తులసి వనంలో కొన్ని గంజాయి మొక్కలను నాటి వెళ్లారు… అవి దుర్గంధం వెదజల్లుతున్నాయి..

అలాంటి గంజాయి మొక్కల్ని మొక్కలను ఒక్కొక్కటిగా పీకేస్తున్నాం…

రోజుకు 18గంటలు పనిచేసి మొత్తం గంజాయి మొక్కల్ని పీకేస్తాం..

జీరో బిల్లుతో పేదలకు ఉచిత కరెంటు అందిస్తోంటే.. కొంతమంది అడ్డు తగులుతున్నారు…

వాళ్ల అడ్డు తొలగించి పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు చేసి తీరుతాం.

మేం అప్పుల గురించి మాట్లాడితే వాళ్లు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు…

రాష్ట్రంపై రూ.9లక్షల కోట్ల అప్పుల భారం ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఏడాదికి చెల్లించాల్సిన అప్పు రూ.6 వేల కోట్లు..

కానీ ఇప్పుడు ఏడాదికి రూ.64 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారు..

ప్రతీ ఏడాది రూ.70 వేల కోట్లు అప్పుల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి..

కేంద్ర ప్రభుత్వంతో, గవర్నర్ తో సామరస్యపూర్వక విధానాలతో ముందుకెళుతున్నాం..

సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళుతున్నాం…

మీ అందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందిస్తాం..

వైబ్రాంట్ తెలంగాణనే మా లక్ష్యం.

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వేల కోట్లకు చేరింది… చట్టబద్ధంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం..

బతుకమ్మను కొందరు వ్యాపార వస్తువుగా, ఆటవస్తువుగా మార్చారు..

బతుకమ్మ, బోనాలు అనాదిగా తెలంగాణలో జరుపుకుంటున్న పండుగలు..

ఎవరు ఉన్నా.. ఎవరు లేకున్నా… బతుకమ్మ, బోనాల పండుగలు జరుగుతాయి…

ప్రైవేట్ చేతిలో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థకు అప్పగించాం..

ధరణి పోర్టల్ ను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే తప్ప అసలు విషయం బయటపడదు.

తప్పులకు కారణమైన వారిని ఉపేక్షించేది లేదు.

You cannot copy content of this page