లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులుగా భార్యాభర్తలు

TRINETHRAM NEWS

అమరావతి: రానున్న ఎన్నికల్లో తెదేపా తరఫున భార్యాభర్తలు పోటీలో నిలవనున్నారు. ఇటీవల వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ఆ పార్టీ నిర్ణయించింది..

ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని.. అదే లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కోవూరు అసెంబ్లీ స్థానానికి ఎంపిక చేశారు. తెదేపాలో తొలిసారిగా భార్యాభర్తలకు లోక్‌సభ, శాసనసభ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. 2009 ఎన్నికల్లో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ నుంచి కొత్తకోట దయాకర్‌రెడ్డి, దేవరకద్ర నుంచి ఆయన భార్య సీతా దయాకర్‌రెడ్డి తెదేపా తరఫున పోటీచేసి గెలిచారు..

You cannot copy content of this page

Scroll to Top