Trinethram News : నారాయణఖేడ్ : ఖేడ్ పట్టణంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న మూడు ప్రైవేటు ఆసుపత్రులు సీజ్ చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి తెలిపారు. గురువారం ఆమె పట్టణంలోని ప్రైవేటు ఆసుత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సురక్ష క్లినిక్, శ్రీసాయివాణి, హెల్త్‌పాయింట్ ఆసుపత్రులకు ఎలాంటి అనుమతులు లేవని గుర్తించి వాటిని సీˆజ్ చేసినట్లు పేర్కొన్నారు. హెల్త్‌పాయింట్ క్లినిక్‌లో 10 మంది వరకు రోగులు ఉండగా తనిఖీని పసిగట్టిన ఆసుపత్రి నిర్వాహకులు.. రోగులను అందులోనే ఉంచి తాళాలు వేసి వెళ్లారన్నారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడంతో యాజమాన్యం ప్రతినిధులు వచ్చి తాళాలు తీసి రోగులను బయటకు పంపించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 30 వరకు అనుమతి లేని ఆసుపత్రులను సీˆజ్ చేసినట్లు వివరించారు. అన్ని ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ ద్వారా అనుమతి పొందాల్సిందేనని స్పష్టం చేశారు…….
ఖేడ్ లో మూడు ఆసుపత్రులు సీజ్
Related Posts
Bomb Threat : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు
TRINETHRAM NEWSశంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు Trinethram News : సైబరాబాద్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసిన అగంతకుడు. అప్రమత్తమై ముమ్మర తనిఖీలు చేసిన ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ . బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేల్చేసిన ఎయిర్ పోర్ట్ అధికారులు…
Nirmal Collectorate : నిర్మల్ కలెక్టరేట్లో కీలక విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి రాసలీలలు
TRINETHRAM NEWSనిర్మల్ కలెక్టరేట్లో కీలక విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి రాసలీలలు Trinethram News : నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో కీలక విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఓ యువతితో రాసలీలలాడుతూ పోలీసులకు చిక్కినట్టు సమాచారం నిర్మల్ శివారులోని ఓ వెంచర్లో నిర్మించిన…