WhatsApp Image 2024 03 13 at 20.43.38
Trinethram News : హైదరాబాద్ :మార్చి13
సాంకేతిక లోపం కారణంగా సికింద్రాబాద్ నుండి తాంబరం వెళ్లవలసిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు ఘట్కేసర్ రైల్వేస్టేషన్‌లో సుమారు రెండు గంటల పాటు ఆగిపోయింది.
5:00 గంటలకు నాంపల్లి నుంచి తంబరం వెళ్లేందుకు బయలుదేరిన చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు6:00 గంటలకు ఘట్కేసర్ స్టేషన్ సమీపానికి చేరుకుంది. ఇంజన్‌లో సాంకేతిక లోపం ఏర్పడడంతో డ్రైవర్ రైలును రైల్వేస్టేషన్‌లో ఆపేశాడు.
స్టేషన్ సిబ్బంది ఉన్నతాధికా రులకు సమాచారాన్ని అందించిన ఎలాంటి ఫలితం లేకపోవడంతో సుమారు రెండు గంటల పాటు రైలు ఆగిపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నారు. రైల్వే అధికారులు రైలు మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు సహకరిం చాలని ప్రయాణికులు కోరుతున్నారు..
