మహా శివరాత్రి పురస్కరించుకొని గౌరవ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి 12వ డివిజన్ సాయినాధ్ కాలనీ శివాలయం లో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు

TRINETHRAM NEWS

నేడు మహా శివరాత్రి పురస్కరించుకొని ఈరోజు గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి 12వ డివిజన్ సాయినాధ్ కాలనీ శివాలయం లో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గౌరవ మేయర్ మాట్లాడుతూ…మహా శివరాత్రి పర్వ దినం అతి పవిత్ర దినమని,శివుడికి అత్యంత ఇష్టమైన రోజని,శివరాత్రి నాడు వాడ వాడల రోజు వారీ ఉపవాస దీక్షలతో,జాగారంతో వేడుక చేసుకుంటామని,శివుడిని ఆరాధిస్తూ పరవశించే తపస్వీ పవిత్ర రోజు మహా శివరాత్రి అని తెలియజేస్తూ ప్రతీ ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటు మరో మారు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు సబిత జలంధర్ రెడ్డి,ఆలయ కమిటీ సభ్యులు
నర్సింహా రెడ్డి,శ్రీనివాస్ నాయుడు,రఘు,పురోషోత్తం,12వ డివిజన్ నాయకులు వెంకటేష్,బట్ట మురళి,గాలి శ్రీనివాస్,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top