జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 19 at 9.34.52 PM

TRINETHRAM NEWS

TS : రాష్ట్రంలో 20మంది ఐపీఎస్‌ల బదిలీ.. డీజీపీగా రవిగుప్తాకి పూర్తి బాధ్యతలు..

హైదరాబాద్‌: తెలంగాణలో 20 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీగా రవిగుప్తాకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతలు అప్పగించింది..

రోడ్డు భద్రతా విభాగం ఛైర్మన్‌గా అంజనీకుమార్‌ను నియమించారు. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా రాజీవ్‌రతన్‌ నియమితులయ్యారు.

ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్‌ నియామకం.

రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్‌.

జైళ్లశాఖ డీజీగా సౌమ్య మిశ్రా నియామకం.

సీఐడీ డీఐజీగా రమేష్‌ నాయుడు.

సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ సంయుక్త కమిషనర్‌గా సత్యనారాయణ.

మధ్య మండల డీసీపీగా శరత్‌చంద్ర పవార్‌.

ఆబ్కారీ శాఖ డైరెక్టర్‌గా కమలాసన్‌రెడ్డి.

టీసీపీఎఫ్‌ అదనపు డీజీగా అనిల్‌ కుమార్‌.

హోంగార్డ్స్‌ ఐజీగా స్టీఫెన్‌ రవీంద్ర.

హైదరాబాద్‌ మల్టీ జోన్‌ ఐజీ-2గా తరుణ్‌ జోషి. హైదరాబాద్‌ మల్టీ జోన్‌-1 ఐజీగా జోషికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్‌ శ్రీనివాస్‌.

ఐజీ పర్సనల్‌గా చంద్రశేఖర్‌రెడ్డి.

సీఐడీ అదనపు డీజీగా శిఖా గోయల్‌ నియమితులయ్యారు. శిఖా గోయల్‌కు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు..

You cannot copy content of this page