జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 19 at 11.29.30 AM

TRINETHRAM NEWS

ఈ అంగన్వాడి కేంద్రానికి దిక్కెవరు?

మండల కేంద్రమైన తర్లుపాడు, బీసీ కాలనీలోని కోట అంగన్వాడి సెంటర్ తాళాలు తీసే దిక్కే లేకుండా పోయింది. వారం రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు వేతనాల కొరకు ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో సచివాలయ సిబ్బంది, వెలుగు సిబ్బంది తాళాలు పగలగొట్టి, పిల్లల బాధ్యతలు చేపట్టారు. పేరుకే బాధ్యతలు తీసుకున్న తప్ప,కానీ వారి నిర్లక్ష్యం కారణంగా కనీసం తాళాలు కూడా తీయడం లేదు. దీంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఆరుబయటే పడి కాపులు కావలసిన దుస్థితి నెలకొంది. జగనన్న పాలనలో అంగన్వాడి కేంద్రాల నిర్వహణ కుంటుపడుతుందని పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు కనీసం కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, అంగన్వాడి నిర్వహణ సక్రమంగా నిర్వర్తించేలా చర్యలు చేపట్టాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

You cannot copy content of this page