జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 19 at 7.52.12 PM

TRINETHRAM NEWS

TS : 20 ఏళ్ల తర్వాత దిల్లీలో కేసీఆర్‌ అధికారిక నివాసం నేమ్‌ ప్లేట్‌ మార్పు..

దిల్లీ: దిల్లీ తుగ్లక్‌ రోడ్డు నివాసం వద్ద కేసీఆర్‌ పేరుతో ఉన్న నేమ్‌ ప్లేట్‌ను అధికారులు మార్చారు. గత 20 ఏళ్లుగా తుగ్లక్‌ రోడ్డులోని 23వ నెంబరు బంగ్లా కేసీఆర్‌ అధికారిక నివాసంగా ఉండేది..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌ ఆ బంగ్లాను ఖాళీ చేశారు. ఆయన వ్యక్తిగత వస్తువులను సిబ్బంది వేరే చోటకి తరలించారు..

2004 నుంచి 2014 వరకు ఎంపీగా, మంత్రిగా తుగ్లక్‌ రోడ్డు నివాసం నుంచే కేసీఆర్‌ కార్యకలాపాలు నిర్వహించారు. ఆ తర్వాత 2014 నుంచి 2023 డిసెంబరు తొలివారం వరకు అదే బంగ్లా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ అధికారిక నివాసంగా ఉంది. ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్‌ సిబ్బంది.. బంగ్లాను ఖాళీ చేసి తెలంగాణ భవన్‌ అధికారులకు అప్పగించారు. తుగ్లక్‌ రోడ్డులోని బంగ్లా దాదాపు 20 ఏళ్ల పాటు కేసీఆర్‌ అధికారిక నివాసంగా ఉంది. సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత మంగళవారం తొలి సారిగా ఈ బంగ్లాను రేవంత్‌రెడ్డి సందర్శించారు. ఎంఎస్‌ ఫ్లాట్స్‌ యమున అపార్ట్‌మెంట్‌లో 902 ఫ్లాట్‌ ప్రస్తుతం రేవంత్‌ నివాసంగా ఉంది..

You cannot copy content of this page