26న కుప్పంలో సీఎం జగన్ పర్యటన

TRINETHRAM NEWS

Trinethram News : AP: ఈ నెల 26వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్బంగా రామకుప్పం మండలంలోని హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం గుండిశెట్టిపల్లి దగ్గర బహిరంగ సభలో పాల్గొని జగన్ ప్రసంగించనున్నారు. అలాగే స్థానిక నాయకులతో సమావేశం కానున్నారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.

You cannot copy content of this page

Scroll to Top