జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 22 at 18.20.15

TRINETHRAM NEWS

Trinethram News : శివ శంకర్. చలువాది

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరీ దారుణంగా దిగజారుతున్నాయి.

ఒక పార్టీపై ప్రత్యర్ధి పార్టీ అత్యంత నీచంగా తప్పుడు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలకు తెర తీస్తున్నాయనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు బహిరంగ సభల్లో సంక్షేమ పథకాలను ప్రకటిస్తుంటే ..

సోషల్ మీడియా లో మాత్రం ఆ పథకాల పేరుతో ఫేక్ ప్రచారం చేస్తున్నారు.

తాజాగా సిద్దం పేరుతో వైసీపీ పార్టీ లోగోతో ఉన్న కండోమ్ ప్యాకెట్లను పంచుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంటే ..

దీనికి కౌంటర్ గా పసుపు రంగు కలర్ లో ఉన్న కండోమ్ ప్యాకెట్ పై భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీకండోమ్ ప్యాకెట్లు పంచుతున్నట్లుగా ఓ వీడియో కూడా విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియో వైసీపీ అమ్మ ఒడికి బదులుగా టీడీపీ అమ్మకు వందనం అమలు చేస్తామని ప్రకటిస్తే మంచిదనుకున్నాం..కాని పిల్లలు ఎక్కువ మంది పుడితే అందరికి స్కీమ్ ఇవ్వాల్సి వస్తుందని టీడీపీ ఈవిధంగా కండోమ్ ప్యాకెట్స్ పంచుతోందని ఇద్దరు యువకులు మాట్లాడుకుంటున్న వీడియో అన్నీ సోషల్ మీడియా గ్రూప్ ల్లో వైరల్ అవుతోంది.

You cannot copy content of this page