జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 20 at 17.32.10

TRINETHRAM NEWS

Trinethram News : కుప్పం పట్టణం: తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర కొనసాగుతోంది. మంగళవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం కొడతనపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త వెంకటేష్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు..

చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గతేడాది అక్టోబరు 10న వెంకటేష్ గుండెపోటుతో మృతిచెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, రూ.3 లక్షల చెక్కును అందజేశారు. పార్టీ తరపున వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెంకటేష్ ముగ్గురు పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చదివించనున్నట్లు ప్రకటించారు..

You cannot copy content of this page