ఘనంగా సెవెన్ హార్ట్స్ ఎన్జీవో వార్షికోత్సవం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ రోటరీ క్లబ్ లో సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాసా శాస్త్రవేత్త డాక్టర్ కావ్య మాన్యపు హాజరై మాట్లాడుతూ దేశం మనకెంతో ఇచ్చిందని, మనం కూడా సేవ చేసి దేశం రుణం తీర్చుకోవాలని, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోటి స్వచ్ఛంద సంస్థను స్థాపించిన సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో కామారెడ్డి సభ్యులకు అభినందనలు అని తెలిపారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు సత్యం మాట్లాడుతూ సమాజానికి సేవ చేసే ఆలోచన చాలా గొప్పదన్నారు. ఎన్జీవో ఫౌండర్ జీవన్ నాయక్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా మా వంతు కృషిగా సమాజానికి చేయాలని ఉద్దేశంతో నే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించామన్నారు. ఎన్జీవో వారు నిర్వహించిన వివిధ ప్రతిభ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు అతిధులు బహుమతులను, ప్రశంస పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో ఫౌండర్ జీవన్ నాయక్, కార్యదర్శి మసూద్, ఎన్జీవో ప్రతినిధులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.