శ్రీదాసాంజనేయ స్వామి వార్షికోత్సవ వేడుకలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం

TRINETHRAM NEWS

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ ఇందిరమ్మ కాలనిలోని శ్రీ దాసాంజనేయ స్వామి సహిత మల్లికార్జున స్వామి వారి ఆలయ కమిటీ సభ్యులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరుగనున్న వార్షికోత్సవం, జాతరకు రావాలని ఎమ్మెల్సీ కి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బెంబడి బుచ్చిరెడ్డి, సోమరాజు ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఈనెల 16వ తేదీ నుండి 20వ తేదీ కరకు జరిగే గాజులరామారంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి జాతరకు రావాలని కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ ని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top