జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 17 at 7.33.10 PM

TRINETHRAM NEWS

చింతవారిపాలెం గ్రామానికి చెందిన 25మంది వైసిపీ కార్యకర్తలు టిడిపి లోకి చేరిక

బాపట్ల మండలం, ముత్తయపాలెం పంచాయతీ, చింతవారిపాలెం గ్రామానికి వైసిపీ కి చెందిన 25మంది వైసిపీ కార్యకర్తలు మాజీ యమ్ పి టి సి జాన్ వేస్లీ, కాగిత జోసప్ గారి ఆధ్వర్యంలో ఆదివారం బాపట్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారిచే తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని పార్టీ లో చేరారు.తెలుగుదేశం పార్టీ విధి, విధానాలు నచ్చి పార్టీ లో చేరటం జరిగిందని, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం సమిష్టి గా కృషి చేస్తామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు తోట నారాయణ,ముక్కామల సాంబశివ రావు, మోదుగుల శంకర్ రెడ్డి,మద్దాల ముసలయ్య, వడ్లమూడి వెంకటేశ్వర్లు,కావూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page