TRINETHRAM NEWS

శ్రీకాకుళంజిల్లా
ఇచ్చాపురం

ఇచ్చాపురం: శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం పట్టణ పోలీసులు 72కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈమేరకు ఇచ్చాపురం పట్టణ పోలీసుస్టేషన్లో ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమ్మన్యుయల్ రాజు పత్రికసమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒరిస్సా నుండి ఆంధ్రకు అక్రమంగా తరలిస్తున్న 72కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. ఒరిస్సా నుండి ఆంధ్రకు రైలులో గంజాయిని తరలిస్తున్న ఉత్తరగౌడ, ఉష భుయాన్, రంజు గుమంగో, పింకీ అనే వారినుండి విశ్వాసనీయ వర్గాల సమాచారం మేరకు దాడులు జరిపి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ఆవరణలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరికి సహాయం అందించిన ఇద్దరు రైల్వే పోలీసులను అదుపులోకి తీసుకున్నట్లుగా వీరిని ఇచ్చాపురం న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లుగా తెలిపారు. అక్రమంగా గంజాయిని తరలించి, విద్యార్థులు, యువత భవిష్యత్తును నాశనం చెయ్యాలని చుస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ సత్యనారాయణ, రూరల్ ఎస్ఐ లక్ష్మణ, కవిటి ఎస్ఐ రాము పాల్గొన్నారు.