అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అగ్రగామిగా నిలుపుతాం

TRINETHRAM NEWS

అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అగ్రగామిగా నిలుపుతాం

  • హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

హైద్రాబాద్ : అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ డాక్టర్. ఎస్ ఏ సంపత్ కుమార్, మరియు జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ హైదరాబాదులోని సీఎం నివాస గృహంలో రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి జోగులాంబ అమ్మవారి జ్ఞాపిక మరియు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు .

జోగులాంబ అమ్మవారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చే భక్త యాత్రికుల సౌకర్యార్థం చేపట్టాల్సిన వివిధ పనులను సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ డా. సంపత్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు .

అతి త్వరలోనే అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకుంటామని, దేవాదాయ శాఖ మరియు పర్యాటక శాఖ ,పురాతత్వ శాఖ మరియు ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని హామీ ఇచ్చారు

You cannot copy content of this page

Scroll to Top